*తెలంగాణ బిసివై పీఏసీ సభ్యుడిగా గుర్రపు పెద్దకొల్ల జైకుమార్ ముదిరాజ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి: భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా కామారెడ్డి జిల్లాకు చెందిన గుర్రపు పెద్దకొల్ల జై కుమార్ ముదిరాజ్ ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న క్రమశిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిస్తున్న చొరవను గుర్తించిన బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.. ఈ నియామకం పట్ల జై కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పీఏసీ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ప్రజల గొంతుకగా నిలుస్తానని ఆయన ఉద్ఘాటించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


