నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…

-శ్రీ కన్నమాంబ పేరంటాలు అమ్మవారి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల…
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక ఆల్కాట్ తోటలో వేంచేసియున్న శ్రీ కన్నమాంబ, పేరంటాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్‌గా దల్లి అప్పలరెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం ఆలయం ఆవరణలో ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి అన్ని ఆలయాలను సుందర వైభవంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. భక్తి, భక్తుల పట్ల నిబద్ధత, ఆలయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారిని మాత్రమే ఆలయకమిటీ పాలక వర్గంలోకి ఎన్నిక చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో విశేష సేవలందిస్తున్న దల్లి అప్పలరెడ్డితో పాటు డైరెక్టర్లుగా రీసు సత్యవతి, ఆకుల దుర్గ నాగమల్లేశ్వరి, నాగళ్ల రుద్ర శివ శంకరరాజు, పిలకా వెంకట రమణారెడ్డి, చిట్టాబత్తుల మోహన్‌బాబు, మాచనవజ్ఞల ఫణి రాజ కుసుమ కళ్యాణి, చెక్క మంగ, బొండపల్లి గణేష్ లకు కమిటీలో స్థానం కల్పించామన్నారు. అనంతరం నూతన పాలకవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకులు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండురి అప్పారావు, మాజీ కార్పొరేటర్ గొందేశి మాధవీలత, గొందేశి హరినాధ్ రెడ్డి, నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, వాసిరెడ్డి బాబీ, కక్కల రమేష్, పల్లి సాయి, కందికొండ అనంత్, రొంపిచర్ల ఆంటోని, వడ్డీ వరప్రసాద్, అర్జీల లక్ష్మణరావు, బొంతు ప్రసాద్, బూర దుర్గాంజనేయులు, కొప్పిశెట్టి చిన్ని, నరసింహమూర్తి, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరు సత్యనారాయణ, కుంచె హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, సుబ్బాయమ్మ, కుసుమ, బంగారు రాజు, చిట్టిబోయిన శ్రీనివాస్, పీత వంశీ, ఇఓ ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


