మానవసేవే మాధవసేవ
శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం, స్వర్ణోత్సవ ఆహ్వానము,
రాజమహేంద్రవరం,(
అఖండ భూమి వెబ్ న్యూస్ ) స్థానిక రోటరీ క్లబ్, వై జంక్షన్ దగ్గర ఏర్పాటు కాబడిన విలేకరుల సమావేశంలో శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం, స్వర్ణోత్సవ ఆహ్వానం మేరకు, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది,
అధ్యక్షులు పతివాడ రామరాజు ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ ఓలేటి సత్యనారాయణ, కోశాధికారి కుంట్ల రామకృష్ణ, సెక్రెటరీ సుబ్రహ్మణ్యం, పర్యవేక్షణలో
సభను ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ
శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం, 1975లో బొమ్మూరు రాజమండ్రి రూరల్ లో స్థాపించడం జరిగింది, 1975 నుండి 2025, 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం కొరకు బ్రోచర్ను ఆహ్వాన పత్రికను ముద్రించడం జరిగిందన్నారు, స్వర్ణోత్సవ ఆహ్వానం
1/2/2026, ఆదివారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు, జరుగుతుందన్నారు,
ముఖ్య అతిథులు గా, శ్రీ ముకుంద సి ఆర్, సహ సర్ కార్యవాహ, ఆర్,ఎస్,ఎస్,(అఖిల భారతీయ సహా ప్రధాన కార్యదర్శి)
శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, పార్లమెంట్ సభ్యులు రాజమహేంద్రవరం నియోజకవర్గం, శ్రీ కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రివర్యులు పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ,
శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి శాసనసభ్యులు రూరల్ రాజమహేంద్రవరం,నియోజకవర్గం, శ్రీ ఆనంద్ స్వరూప్ అడవాని,
స్వర్ణోత్సవ ఆహ్వానంలో పాల్గొంటారని పేర్కొన్నారు,
డైరెక్టర్ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ వ్యాధి మూలంగా సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వారికి గౌరవప్రదమైన జీవితం అందించాలని ఉద్దేశంతో వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం స్థాపించడం జరిగిందన్నారు, వ్యాధిని మాత్రమే కాదు ఒంటరితనాన్ని కూడా తొలగించడమే మానవ సామాజిక సేవ మరియు ఆధ్యాత్మిక వికాసములకు ప్రతీకగా నిలుస్తున్న దన్నారు,
కుష్టు వ్యాధిగ్రస్తులు విముక్తులు మరియు వారి పిల్లలకు సురక్షిత నివాసము నిత్య ఆహారం వసతి దుస్తులు నిరంతర వైద్య సంరక్షణ మానసిక ధైర్యము కుటుంబ వాతావరణం కల్పిస్తూ వారిని సమాజంలోకి ప్రవేశింప చేయడమే దీని లక్ష్యం అని అన్నారు, దీనిలో భాగంగా చారిటబుల్ క్లినిక్, చుట్టుప్రక్కల ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కారమునకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని సదుద్దేశంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులు వైద్య పరీక్షలు జరిపించి దోహదపడుతున్నామన్నారు,
గో సేవ, గోవుల సంరక్షణ సేవ ద్వారా ధార్మిక విలువలు పరిరక్షణ 1998లో సూర్య భగవాన్ మందిరం ఏర్పాటు చేయడం దీని ద్వారా మనశ్శాంతి భారతీయులకు ఒక నమ్మకం రథసప్తమి రోజు న 10 నుండి 15 వేల మంది భక్తులు ఇక్కడికి సందర్శించి కుష్టు వ్యాధిగ్రస్తులును పరామర్శించి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఇంట్రాక్ట్ అవటం వలన వారి మనోబలం పెరగడం జరుగుతుందన్నారు,
పరిసరాల్లో నివసించుచున్న యువత యొక్క శరీరక మానసిక ఆధ్యాత్మిక వికాసం కొరకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో గ్రామీణ యువతీ యువకులకు, ఉపాధి అవసరంలను తీర్చుటకునుగాను, వృత్తి నైపుణ్య కేంద్రమును నిర్మిస్తామన్నారు,
ఔషధ మొక్కలకు క్షేత్రమును అభివృద్ధి పరిచే ప్రణాళిక ఉందన్నారు, 10 కుటుంబాలు 1975 నుండి శాశ్వతమైన గృహ నిర్మాణాలు చేసుకుని ఇక్కడే ఉంటున్నా రన్నారు, ప్రస్తుతం 40 మంది పేషెంట్లు, మరియు 10 మంది వృద్ధులు ఆరోగ్య కేంద్రంలో ఉంటున్నారు, భవిష్యత్తులో పరిసర ప్రాంత గ్రామాల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష ఈ కార్యక్రమంలో బొమ్మూరు బిజెపి నాయకులు పాల్గొన్నారు,
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ లో అల్పాహారం అందజేసిన భాస్కర్ రావు


