.సీఎం కప్ క్రీడాలను ప్రారంభించిన పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి
…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గ్రామాల క్రీడాకారులు సీఎం కప్ కోసం క్రీడలను టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రామీణ స్థాయి నుండి మండల ,జిల్లా ,రాష్ట్ర, జాతీయ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలలో రాణించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువులతోపాటు క్రీడల్లో రాణించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, దోమకొండ సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, తీగల తిరుమల గౌడ్, అనంతరెడ్డి, సీతారాం మధు ముదిరాజ్,కదిరి గోపాల్ రెడ్డి, , ఆశ బోయిన శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్స్ అనిల్, సాయి, మౌర్య, ప్రజాప్రతినిధులు, విద్యార్థి క్రీడాకారులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


