మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై జాగృతి నాయకుల పోటీ
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై జాగృతి నాయకులు పోటీ చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు బి. వసంత గురువారం వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు, జిల్లా జాగృతి అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాలతో ఈ ఎన్నికల్లో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలు సింహం గుర్తుపై బరిలో నిలుస్తున్నారని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా జాగృతి రైతు అధ్యక్షులు రాజు, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శమంత, జిల్లా జాగృతి స్టూడెంట్ అధ్యక్షులు రాజేష్, రాము, శివ, వినోద్, అఫ్రిన్, కౌన్సిలర్ అభ్యర్థులు కురుమ సతీష్, మమత బేగం, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


