డప్పు కళాకారులకు పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయాలి…
సమస్యలు పరిష్కరించాలి.
ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు జిల్లా కార్యదర్శి బి కరుణాకర్.
వెల్దుర్తి,నవంబర్ 05 (అఖండ భూమి న్యూస్) :
డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ ను వెంటనే విడుదల చేయాలని, డప్పు కళాకారుల పెన్షన్ 4వేల నుండి 7వేలకు పెంచాలని, పెన్షన్ వయసును 45 సంవత్సరాలకు తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి బి.కరుణాకర్ లు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తి లోని సిఐటియు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డప్పు కళాకారుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా కార్యదర్శి కరుణాకర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి చేసుకున్నా నేటికి డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ ను విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే పెన్షన్ ఆన్లైన్ ను విడుదల చేయాలన్నారు. తరతరాలుగా అంటరానితనాన్ని అవమానాన్ని భరిస్తూ సమాజమంతటికి ఉపయోగపడే సాంప్రదాయకళ గా ఉన్న డప్పు కళ పెన్షన్ ను 7 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని, అర్హులైన ప్రతి డప్పు కళాకారునికి డప్పు గజ్జలు డ్రస్సు ప్రభుత్వమే ఇవ్వాలని, ఆరోగ్య భీమా వర్తింపజేయాలని, బస్సు ప్రయాణాల్లో రాయతీలు కల్పించాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 27న ఎమ్మిగనూరులో డప్పు కళాకారుల జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వెల్దుర్తి మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని డప్పు కళా కారుల తో పాటు జిల్లాలోని అన్ని మండలాల నుంచి డప్పు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఏపీ డప్పు కళాకారుల సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
సమావేశ అనంతరం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం మండల గౌరవ అధ్యక్షులుగా నాగరాజు, మండల అధ్యక్షులుగా రామాంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శిగా రత్నపల్లె మధు, ఉపాధ్యక్షులుగా బోయినపల్లి తిరుపాలు, నరసాపురం లక్ష్మన్న, సర్ప రాజాపురం పెద్ద మద్దయ్య, మండల సహాయ కార్యదర్శులుగా ఎల్ బండ బలరాముడు, నర్సాపురం స్వాములు, బోయినపల్లి నారాయణ, రత్నపల్లి రాజ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రాజు, కాటికాపర్ల సంఘం మండల నాయకులు సుంకన్న పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి మరో 25 మంది డప్పు కళాకారులు పాల్గొన్నారు.



