వంశిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
-వంశీని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపించాలి.
-వంశి నా భార్య స్వాతి కుట్ర ఫన్నీ దాడి చేశారు.
పత్తికొండ నవంబర్ 05 (అఖండ భూమి న్యూస్) :
తనపై దాడి చేసిన వంశీని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని వెంటనే వంశీని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించాలని బాధితుడు పులికొండ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. వివరాల్లోకి వెళితే పత్తికొండ పట్టణానికి చెందిన గొల్ల పులికొండ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్న జీవనం సాగిస్తున్నారు. అయితే పులికొండ భార్య స్వాతి పత్తికొండ పట్టణానికి చెందిన వంశీ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని గత ఐదు సంవత్సరాలుగా తనను ఇద్దరు కలిసి హింసిస్తున్నారని, తనతో కలిసి ఉండలేక సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నామని తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం నా పేరు మీద ఉన్న ఇల్లు నా భార్య స్వతి పై పేరుమీద రాయించాలని డిమాండ్ చేసిందని తాను ఒప్పుకోకపోవడంతో తన ప్రియుడితో కలిసి నన్ను అంత మోదించి ఇల్లు స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశంతోనే సోమవారం రాత్రి వంశి అనే యువకుడు తనపై ఇనుప రాడ్డుతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడని స్థానికులు అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డానని తెలిపాడు. తనను చంపాలనే కుట్రతో తనపై దాడి చేశాడని ఈ దాడిలో నా తలకు14 కుట్లు పడ్డాయని తెలిపారు. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లి నన్ను చంపేందుకు కుట్రపన్ని దాడి చేశారని కంప్లైంట్ ఇస్తే, పోలీసులు వేరే సెక్షన్లు పెట్టి కేసు నిరు కారుస్తున్నారని వంశీకి పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ కాపాడుతున్నాడని పులికొండ తెలిపారు. ఇప్పటికైనా తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపించాలని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.



