ప్రైవేట్ ట్రావెల్స్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు

ప్రైవేట్ ట్రావెల్స్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు

 

యజమానులకు హెచ్చరికలు

డ్రైవర్ల భద్రతా ప్రమాణాలు, ఎగ్జిట్‌ డోర్లు, ఫైర్‌ కంట్రోల్ పరికరాలు పరిశీలన

క్రిష్ణగిరి, నవంబర్ 05 (అఖండ భూమి న్యూస్):

క్రిష్ణగిరి ఎస్సై జి.కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి నిన్న రాత్రి పై అధికారుల ఆదేశాల మేరకు అమకుతాడు టోల్‌గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీలో భాగంగా డ్రైవర్లు మరియు ప్యాసింజర్ల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఎగ్జిట్‌ డోర్లు, లగేజ్ క్యారియర్‌లలో అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే దానిపై విపులంగా పరిశీలన జరిపారు. ఫైర్‌ను నియంత్రించడానికి అవసరమైన పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అని చెక్‌ చేశారు.

ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లకు సురక్షిత ప్రయాణం కోసం తగు సూచనలు అందజేసిన ఎస్సై గారు, నియమ నిబంధనలు ఉల్లంఘించిన బస్సు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికుల ప్రాణ భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగకుండా చూడాలని ఆయన సూచించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!