రాజీవ్ ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లను డిఈఓ తమ ఉద్యోగాలలో యదావిధిగా కొనసాగించాలి…
ఆరు నెలల పెండింగ్ వేతనాలు అడిగినందుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగుల తొలగింపు అన్యాయం..
సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 12 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లను తమ ఉద్యోగాలలో యధావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. డాటా ఎంట్రీ ఆపరేటర్లు గత కొన్ని సంవత్సరాలుగా నిబద్ధతతో ఆసుపత్రి కి సేవలు అందిస్తున్నారని ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని ఉద్యోగాల నుండి తొలగించడం అన్యాయమని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో వారి పాత్ర కీలకమైనదనీ వారిని తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుండి కామారెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సేవలకు అంతరాయం కలుగుతుందనీ అన్నారు. ప్రస్తుతం *ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.* ఈ విషయాన్ని పట్టించుకునే అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని ఎవరూ లేకపోవడం శోషనీయమని అన్నారు.
ఇప్పటి వరకు సేవలందించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను తక్షణం తిరిగి విధుల్లో కొనసాగించాలనీ,
వేతనాలు , పెండింగ్ బకాయిలను తక్షణం చెల్లించాలని
ఉద్యోగ భద్రత కల్పిస్తూ శాశ్వత నియామకాలు చేయాలనీ,
భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా స్పష్టమైన పాలసీ రూపొందించాలనీ, అన్నారు.
ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది అందరికి సమాన హక్కులు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు.
అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



