నాతవరం. అక్టోబర్ 27 అఖండ భూమి న్యూస్.
తాండవ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో అధికారులు తమ బాధను వినాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. తాండవ నదీ పరివాహక ప్రాంతం లోని గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఒకేసారి అధిక నీటిని విడుదల చేయవద్దని అధికారులను కోరుతున్నారు. దీనివలన తాండవ నదీ పరివాహక గ్రామాలలో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని ఒకవైపు తుఫాను మరోవైపు నీటి ప్రవాహం ల మధ్య వేదనకు గురై జీవించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసి అధిక నీటిని విడుదల చేయటంతో అంచనాలకు మించి పశువులు, వాహనాలు, మనుషులు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రవాహం అధికమై తీవ్ర నష్టాలు వాటిల్లాయని వాపోయారు.ఇప్పటికే ప్రాణ భయంతో తాండవ నదిని ఆనుకుని ఉన్న గ్రామాలలోని ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. దీనిపై అధికారులు ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ANDHRA NEWS PAPER

