కలెక్టరేట్ ప్రజావాణిలో 80 దరఖాస్తులు స్వీకరణ…
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 6 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 80 దరఖాస్తులను సోమవారం స్వీకరించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను కలెక్టర్ స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం పెండింగ్ దరఖాస్తుల పై ఆరా తీశారు. తహసీల్దార్ లు, ఆయా శాఖల అధికారులు ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులతో పాటు, ఆయా సంక్షేమ, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని,
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వి గిరి, పీడీసీ రవితేజ, వీఆర్వో పాండు, జడ్పీ సీఈఓ చందర్, , జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


