అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమీక్ష…

ప్రభుత్వ పథకాలను లక్ష్యాలకు అనుగుణంగా సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);

 

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

సమీక్షలో చర్చించిన ప్రధాన అంశాలు

1. SIR – సమగ్ర ఇంటింటి సర్వే

గ్రామీణ మండలాల్లో సర్వే ప్రక్రియ ఆశించిన మేరకు కొనసాగుతుందని, పట్టణ ప్రాంతాలలో ప్రతి అను వేగవంతం చేయాలని సూచించారు.

కామారెడ్డి మున్సిపాలిటీలో సర్వేను వేగవంతం చేసి ఎన్యుమరేషన్ ఫారంలను త్వరగా డిజిటలైజేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో రేషనలైజేషన్ చేపట్టి కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సిఫారసులను 20వ తేదీ లోపు కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఈఆర్ఓలు, ఏఆర్ఓలకు ఆదేశించారు.

2.భూ భారతి

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కి వచ్చే భూ సమస్యలను వెలువెంటనే పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు

3. తహసీల్దార్ మరియు SRO కార్యాలయాలు

తహసీల్దార్ మరియు SRO కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించి, కేటాయింపును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

4. షాదీ ముబారక్ & కళ్యాణ లక్ష్మి

దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారులకు నిధులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

5. సింగూర్ కాంటింజెన్సీ తాగునీటి పనులు

సింగూర్ ప్రాజెక్టుపై ఆధారపడ్డ 14 మండలాలు, రెండు మున్సిపాలిటీలలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున నీటి పరిరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఎంపీడీవోలు, పీడీ డీఆర్‌డీవో మరియు సంబంధిత అధికారులు నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించి పనులను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.

6. ఇందిరమ్మ ఇళ్ల పథకం

గుడిసెల గ్రౌండింగ్‌ను వేగవంతం చేయాలి.

•గృహ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలి.డెమో ఆథెంటికేషన్ వంటి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి.ఉపాధి హామీ పథకం ద్వారా గరిష్టంగా వ్యక్తి పనిదినాలు కల్పించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!