కష్టాల్లో ఉన్న కుటుంబానికి పెద్దన్నలా అండగా నిలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్…
ఆర్థిక సాయం, ఉద్యోగ హామీతో భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);
ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ఓ నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మానవత్వాన్ని చాటుతూ ఆర్థిక సహాయం అందించారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని 5వ వార్డుకు చెందిన ఓ నిరుపేద మహిళ, తన భర్త దివ్యాంగుడు కావడంతో కుటుంబ పోషణ భారమంతా తనపై పడిందని, రోజువారీ జీవనం కూడా ఎంతో కష్టంగా మారిందని ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి తన గోడును వినిపించింది. కుటుంబ పరిస్థితిని వివరించుకుంటూ కన్నీటి పర్యంతమైన ఆమె బాధను ఎమ్మెల్యే ఎంతో ఓర్పుగా ఆలకించారు.
ఆమె పరిస్థితిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ , తక్షణ ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. అంతేకాకుండా, ఆమెకు తగిన ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని, ఎక్కడైనా మంచి ఉద్యోగం వచ్చేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే చూపిన ఈ మానవతా దృక్పథానికి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురై కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి స్పందించడం మదన్ మోహన్ గారి సేవా భావానికి నిదర్శనమని స్థానికులు కొనియాడారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


