*ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బూమ్ పల్లి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్);
*ఎల్లారెడ్డి నియోజకవర్గం, సదాశివనగర్ మండలం:* భూమ్‌పల్లి గ్రామ సర్పంచ్ *గైని శ్రీనివాస్*, వార్డు సభ్యుడు *బండ శ్రీను* ఎమ్మెల్యే *మదన్ మోహన్* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, కానీ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాలు తమను కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేశాయని అన్నారు.
భూమ్‌పల్లి గ్రామానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో *సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళా సంఘ భవనం* వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


