*వందేమాతర గీతానికి రక్షణలు…
_‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే..కేంద్రం కీలక బిల్లు సిద్ధం.._
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్);
వందేమాతరానికి జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలకమైన ‘Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026’ ను ప్రవేశపెట్టనుంది. *జూలై 20* నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సన్నాహాలు చేస్తోంది.
జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు , 2026 బిల్లు ద్వారా జాతీయ గీతం *‘‘వందేమాతరం’’* ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రకటించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఇందు కోసం 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లో సవరణ చేయనుంది.


