షబ్బీర్ అలీని కలిసిన మాచారెడ్డి మండల సర్పంచ్ లు…

షబ్బీర్ అలీని కలిసిన మాచారెడ్డి మండల సర్పంచ్ లు…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ నివాసంలో మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాచారెడ్డి గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి ని మాచారెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మండలంలోని సర్పంచులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో షబ్బీర్ అలీ ఆయనకు అభినందనలు తెలిపారు. విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

అనంతరం మాచారెడ్డి మండలానికి సంబంధించిన పలు అభివృద్ధి, ప్రజా సమస్యలను సర్పంచులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ఓర్పుగా విన్న ఆయన సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో నిరంతరం మమేకమై గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నౌసిలాల్, సర్పంచులు కేతావత్ కాంలు, కేలోత్, పద్మ, స్వామి,, మాలోత్ వసంత శివాలాల్, మాలోత్ సంతోష్, బానోత్ శ్రీరామ్, మాలోత్ రుక్కి, చంద్రునాయక్, భూక్యా రాజవ్వ, మరుపాక అంజమ్మ లక్ష్మీరాజం, లావణ్య రాజకుమార్, అనిల్, బన్నీ, సంతోష్ రెడ్డి, లక్ష్మి మల్లారెడ్డి, మమత రమేష్ రెడ్డి, సునీత శంకర్, శిల రవికుమార్, మాన్ సింగ్, సదర్, శ్రీనివాస్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!