14వ వార్డ్ లో ప్రైమరీ స్కూల్లో అవగాహన కల్పించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ…

14వ వార్డ్ లో ప్రైమరీ స్కూల్లో అవగాహన కల్పించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొని, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం, సామాజిక బాధ్యత, గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇకపై పాలాభిషేకాలు, జలాభిషేకాలు నిర్వహించకుండా, ఆ వనరులను అవసరమైన పేద ప్రజలకు వినియోగించాలని టీపీసీసీ నిర్ణయించిన విషయాన్ని వివరించారు.

అలాగే నాయకులకు భారీ పూలమాలలు వేయడానికి జేసీబీలు, బుల్డోజర్లు లేదా ఇతర భారీ యంత్రాలను ఉపయోగించడం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన వనరులను ఆర్భాటాలకు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నిరాడంబరత, వనరుల సంరక్షణ, సామాజిక న్యాయం, ప్రజా సేవ అనే విలువలను ప్రతి కార్యకర్త ఆచరణలో చూపించాలని పిలుపునిచ్చారు. పార్టీ మార్గదర్శకాలను ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు.

“ఆర్భాటం కాదు… ఆదర్శం మన కాంగ్రెస్ సంస్కృతి.”

“వృథా కాదు… సేవే మన లక్ష్యం.”

కార్యక్రమంలో పాల్గొన్న, మున్సిపల్ కౌన్సిలర్,రామ్ శెట్టి హర్షిత,తాటి లావణ్య, మాజీ కౌన్సిలర్లు,రాణి, పిడుగు మమత, పంపరి లత, నిత్య,సుగుణ, కవిత, గీత, ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!