కామారెడ్డిలో టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ విజయగాథల పుస్తకావిష్కరణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల (టి ఎస్ ఎస్ సి) స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలను ప్రతిబింబించే “విజయగాథలు” పుస్తకాన్ని నేడు ఘనంగా ఆవిష్కరించారు. కలెక్టర్ ఛాంబర్ లో
ఈ పుస్తకాన్ని ఆశిష్ షాంగ్వాన్, చేతుల మీదుగా ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో విక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డిప్యూటీ కలెక్టర్ రవితేజ.పి. వెంకటేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి (డి ఎస్ సి డి ఓ), మరియు దేవిదాస్, డైరెక్టర్, నిజామాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ పాల్గొన్నారు.
ఈ పుస్తకంలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది వివిధ పోటీ పరీక్షల్లో విజయాలు సాధించిన అభ్యర్థుల స్ఫూర్తిదాయక విజయగాథలను పొందుపరిచారు. ఈ విజయగాథలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రేరణగా, మార్గదర్శకంగా నిలవడంతో పాటు, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అందిస్తున్న నాణ్యమైన శిక్షణ, మార్గనిర్దేశం మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల అభివృద్ధికి సంస్థ చేస్తున్న విశేష కృషిని ప్రతిబింబిస్తున్నాయి.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


