అనుమతి లేకుండా హోటల్ లో మద్యం విక్రయిస్తున్న అధికారులు దాడులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీలోని హోటళ్లపై అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న సమాచారం మేరకు దాడులు శనివారం నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా గల లక్ష్మీ మెస్ లో అనుమతి లేకుండా మద్యం తాగిపిస్తూ మెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి లింబయోల దిలీప్ రెడ్డి పై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీ లోని హోటల్లో, మెస్ లలో, దాబాల యందు అనుమతి లేకుండా మద్యం విక్రయాలు జరిగినా మద్యం సేవించుటకు అనుమతించిన కేసులు నమోదు చేయడం జరుగుతుందని , ఎటువంటి సమాచారం ఉన్న మాకు తెలియజేయాలని ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపారు. ఈ దాడులలో సీఐ సంపత్ కృష్ణ , ఎస్సై విక్రంకుమార్, హెడ్ కానిస్టేబుల్ ఫరీద్ , కానిస్టేబుల్స్ రాజు, దినేష్ లు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


