సీజనల్ వ్యాధుల నియంత్రణకు సమగ్ర చర్యలు చేపట్టాలి…
పిహెచ్‌సీ వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె. వెంకట్ వీడియో కాన్ఫరెన్స్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి: సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య కార్యక్రమాల సమర్థవంతమైన అమలు మరియు క్షేత్రస్థాయి ఆరోగ్య సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె. వెంకట్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం, డయేరియా మరియు ఇతర సీజనల్ వ్యాధుల కేసులను ప్రారంభ దశలోనే గుర్తించాలని ఆదేశించారు. గుర్తించిన కేసులకు వెంటనే చికిత్స అందించడంతో పాటు అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తి చేయాలి
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు మత పెద్దలు, కుల పెద్దలు మరియు ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ సురక్షితమైనదని, బాలికలు మరియు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో ఉపయోగకరమని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన బాలికకు వ్యాక్సినేషన్ అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతి పిహెచ్‌సీ పరిధిలో ఆరోగ్య శిబిరాలు
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన మందులు అందించడంతో పాటు వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


