మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా
మణుగూరు మే 26 (అఖండ భూమి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన సర్వ సభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని శాఖల వారిగా పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలి అన్నారు.వర్షాకాల సీజన్ సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిశుభ్రం చేయాలని ,పోడు భూములకు త్వరలో పోడు పట్టాలు, రైతుబంధు మరియు జూన్ 2 నుంచి 21 రోజులపాటు జరిగే దశాబ్ది ఉత్సవాలలో పదేళ్ల అభివృద్ధికి సంబంధించిన ప్రగతిని గురించి గ్రామాలలో కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల భాగ్యస్వామ్యం ఉండడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని మిషన్ భగీరథ అధికారుల పనితీరును వారు ప్రశంసించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



