నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ సహా ఏడుగురు ముఖ్యమంత్రులు డుమ్మా..

 

 

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ సహా ఏడుగురు ముఖ్యమంత్రులు డుమ్మా..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతనలో ఈ రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి ఏడుగురు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు..

మరో ఇద్దరు ప్రతిపక్ష నేతలు.. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌లు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. వీరంతా ప్రతిపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు.

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను బాయ్‌కాట్ చేయడం అంటే.. ఆయా ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాల అభివృద్ధిని కుంటుపట్టించడమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వందకు మించి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్నదని తెలిపాయి. ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహించని రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!