తెలంగాణలో ఐపాస్ విప్లవం  ..

 

తెలంగాణలో ఐపాస్ విప్లవం

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 6 ( అఖండ భూమి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం లోని నవ భారత్ స్కూల్ ఆడిటోరియం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.తొలిత వారికి అధికారులు తఘన స్వాగతం పలికారు, తరువాత ఆయన వేదికపై కళాకారులతో కలిసి నాట్యం చేస్తూ అందరిని ఉత్సాహపరిచారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ

సీఎం కేసీఆర్ విజన్ తో రాష్ట్ర అన్ని రంగాలలో అద్భుత ప్రగతి సాధించిందని, సింగరేణి కెటిపిఎస్ డిటిపిఎస్ వంటి అన్ని సంస్థలు దిగ్విజయంగా ముందుకు కొనసాగుతున్నాయని, పారిశ్రామిక రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని,

పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ఎంతో శరవేగంగా దూసుకుపోతున్నదని అన్నారు.విదేశీ సంస్థలను ఆకర్షించడంతోపాటు కొత్త పరిశ్రమలు ఏర్పాటు సరళీకృతం చేస్తూ టీఎస్ ఐ పాస్ లాంటి విప్లమాత్మక సంస్కరణలు ఎన్నో చేపడుతుందన్నారు ఈవిధానంలో కేవలం 15 రోజులలోనే పరిశ్రమలకు కావలసిన అన్ని రకాల అనుమతులు ఇస్తున్నారని అన్నారు.

పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా వాటికి నిరంతరయంగా నాణ్యమైన విద్యుత్, నీళ్లు కూడా అందిస్తుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చెందుతున్నది అన్నారు.పారిశ్రామిక రంగానికి తెలంగాణ రాష్ట్రం సర్వదామంగా సాగుతున్నది అన్నారు ఈ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు, విధానాలు పారిశ్రామిక రంగానికి వరంగా మారాయన్నారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్నారు కంపెనీల ఏర్పాటుకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సైతం సంపూర్ణంగా అందిస్తుంది అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ దురిశెట్టి అనుదీప్,ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్,ప్రభుత్వ అధికారుల,తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!