DGP Rajendranath Reddy: రాష్ట్రంలో నేరాలు పెరిగాయనడం కరెక్ట్ కాదు.. డబ్బు కోసమే ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్..
ఏపీలో నేరాలు పెరిగాయనడం కరెక్ట్ కాదన్నారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఘటనలో గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నామని ఆయన తెలిపారు..
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లోనే ఉందని డీజీపీ అన్నారు. డబ్బుకోసమే ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. రౌడీషీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉంది. ఏపీ క్రైమ్‌రేట్ తగ్గిందని స్పష్టం చేశారు.
భూ కబ్జాల కేసులు తక్కువ నమోదవుతున్నాయి. గంజాయి పంటలను రెండు సంవత్సరాల నుండి ధ్వంసం చేస్తున్నాం. గంజాయి అమ్మేవాళ్లపై పీడీ యాక్ట్‌లు పెడుతున్నాం. ఒరిస్సా నుండి గంజాయి వస్తోంది.. మన రాష్ట్రంలో గంజాయి సాగు లేదు. నిందితులకు వేగంగా శిక్షలు పడుతున్నాయి అని వెల్లడించారు..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



