Chandrababu: నియోజకవర్గ ఇన్‌ఛార్జిల నియామకం, నేతల పనితీరుపై చంద్రబాబు సమీక్ష..
మరావతి: నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల నియామకం, నేతల పనితీరుపై బుధవారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమీక్షించారు. నాయకుల మధ్య విభేదాల పరిష్కారం, పార్టీలో చేరికలు, భవిష్యత్‌కు గ్యారెంటీపై ప్రచార కార్యక్రమం వంటి అంశాలపై చర్చించారు..
వర్గపోరు ఉన్న స్థానాలపై చంద్రబాబు సమీక్షించారు. గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలపై చర్చలో గోపాలపురం ఇన్‌ఛార్జి వెంకటరాజు, పార్టీనేత బాపిరాజులతో భేటీ అయ్యారు.
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు గురువారం తెదేపాలో చేరనున్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీ పై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. యువగళం పాదయాత్ర ఒక వైపు, భవిష్యత్‌కు గ్యారెంటీపై చంద్రబాబు ప్రచార యాత్రలు మరో వైపు ఉండనున్నాయి. ఇప్పటికే ఐదు జోన్లలో భవిష్యత్‌కు గ్యారెంటీపై పార్టీ నేతల చైతన్య రథయాత్రలు కొనసాగుతున్నాయి..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



