Chandrababu: కేంద్ర మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు లేఖ..
అమరావతి: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో చనిపోయిన అద్దంకికి చెందిన రాజేశ్‌కుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కోరారు..
అద్దంకికి చెందిన రాజేశ్.. ఇటీవల ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లారు. బీచ్‌లో తన పిల్లలను రక్షించే ప్రయత్నంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్ భౌతికకాయాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెచ్చేందుకు సహకారం అందించాలని కేంద్రమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



