నారా లోకేష్ పాదయాత్రలో జనసేన
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేరుకుంది..ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పాదం కలిపారు. జనసేన, యువగళం జెండాలతో పాదయాత్రకు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికులకు లోకేష్ అభివాదం చేశారు..తాను ఎస్సీలను అవమానించినట్లు ఒక మీడియా సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఎస్సీలను అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు..నిరూపించలేకపోతే భారతీరెడ్డి తన పత్రిక, ఛానెల్ మూసేస్తారా? అని సవాల్ విసిరారు. తాను ఎస్సీలను అవమానించినట్లు చూపిన వీడియోలో చప్పట్లు కొడుతున్నారని, తాను అవమానిస్తే వారు చప్పట్లు కొడతారా? ఇంత చిన్న లాజిక్ ను భారతీరెడ్డి ఎలా మిస్ అయ్యారని లోకేష్ ప్రశ్నించారు..
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l



