జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మౌర్య

రీ సర్వే, స్పందన రెవెన్యూ సమస్యల పై ప్రత్యేక దృష్టి

ప్రజలకు అందుబాటులో ఉంటా

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నారపురెడ్డి మౌర్య

కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 12, (ఆఖండ భూమి న్యూస్):

జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అమలు, స్పందన లో వచ్చే రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉదయం 10 గంటలకు జాయింట్ కలెక్టర్ గా నారపురెడ్డి మౌర్య బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల జిల్లా లో ఉన్న సమస్యలపై మంచి అవగాహన ఉందన్నారు.. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా కొంత కాలం పని చేశానని, అనంతరం మెటర్నిటీ లీవ్ లో వెళ్ళడం జరిగిందన్నారు..మే 12 వరకు సెలవు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కర్నూలు జాయింట్ కలెక్టర్ గా ఉత్తర్వులు ఇచ్చినందున విధులకు హాజరు కావడం జరిగిందన్నారు..జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అమలు, స్పందన లో వచ్చే రెవెన్యూ సమస్యలు, ఆర్ వో ఆర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, పిటిషనర్ లు తమ సమస్యలు తెలుపుకోవచ్చని ఆమె సూచించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జాయింట్ కలెక్టర్ కు డిఆర్వో నాగేశ్వర రావు, పలువురు జిల్లా అధికారులు పూల గుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు..

రాజకీయంగా ఏ విధమైన ఒత్తిడి చేయలేదు : జేసీ

కర్నూలు జాయింట్ కలెక్టర్ గా పోస్టింగ్ అంశంలో తాను రాజకీయ ఒత్తిడి చేసినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త వాస్తవం కాదని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు..వాస్తవంగా తనకు మే 12 వరకు మెటర్నిటీ లీవ్ ఉందని, అయినా ప్రభుత్వం తిరుపతి మునిసిపల్ కమిషనర్ గా ఉత్తర్వులు ఇవ్వడం వల్ల అక్కడకు వెళ్ళాలనుకున్నానని, అయితే మళ్లీ ప్రభుత్వం కర్నూలు జాయింట్ కలెక్టర్ గా ఉత్తర్వులు ఇవ్వడం వల్ల సెలవు రద్దు చేసుకుని కర్నూలులో జాయిన్ అయ్యానని, ఐఏఎస్ అధికారి గా ప్రభుత్వం ఎక్కడకు ఉత్తర్వులు ఇచ్చినా వెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు.

admin1

Masapogu Eswaraiah... Akhanda Bhoomi.. Telugu Daily News.. Telugu Web News.. Edtior & Publisher.. Cell : 9441626873.