తడి చెత్త పొడి చెత్త వేరుచేయాలి

తడి చెత్త పొడి చెత్త వేరుచేయాలి

 

జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు

పుల్లల చెరువు అఖండ భూమి డిసెంబర్ 12 న్యూస్

పుల్లలచెరువు మండలం పరిధిలోని ఎస్సీ కాలనీ ని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు పరిశీలించారు.

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాయి, ఎందుకంటే ఇది చెత్త నిర్వహణను సులభతరం చేస్తుంది, వ్యాధులు రాకుండా కాపాడుతుంది, మరియు కంపోస్ట్ ఎరువుగా మార్చడం ద్వారా భూమికి మేలు చేస్తుందిఅని జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. అలాగే

పుల్లలచెరువు మండలంలో ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రజల ఇల్లు దగ్గరికి వెళ్లి తడి చెత్త పొడి చెత్తని వేరు వేరు చేసి మున్సిపల్ బండిలో వేయాలని ఆదేశించారు . అలాగే పుల్లలచెరువు మండల ప్రాంత ప్రజలకి

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా రాష్ట్ర మునిసిపల్‌ పరిపాలనా విభాగం దశాబ్దం క్రితం ఇంటింటా చెత్త సేకరణను ప్రారంభించింది. మునిసిపల్‌ పారిశుధ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అయితే ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది కోరుతూనే ఉన్నారు. ఇం దుకు అనుగుణంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు పలు మార్లు ప్రతి ఇంటికి రెండేసి బుట్టలను అందించారు కూడా. అయినప్పటికీ ప్రజల్లో మార్పు మాత్రం రాలేదని చెత్త సేకరణ సిబ్బంది వాపోతున్నారు. ఈ మేరకు పుల్లలచెరువు మునిసిపాలిటీలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని నిర్ణయించారు. ఇందుకోసం చెత్త సేకరణకు ఇళ్లకు వెళుతున్న పారిశుధ్య సిబ్బంది తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే కొద్ది మంది మునిసిపల్‌ సిబ్బంది సూచనలను పరిగణలోకి తీసుకోగా మరికొద్ది మంది పాతవిధానంలోనే చెత్తను అందిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించే ఇళ్లనుంచే చెత్తను సేకరించాలని మునిసిపల్‌ పారిశుధ్య విభాగం నిర్ణయించింది . ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు ఎంపీడీవో మరియదాసు, ఇంచార్జ్ పిడిఓ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం, సచివాలయం సిబ్బందిలు, ప్రజా ప్రతినిధులు, డి పి ఆర్ సి సిబ్బందిలు, పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!