29లోగా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

29లోగా రైతు భరోసా కోసం కొత్త రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

తుగ్గలి ఏప్రిల్ 26 (అఖండ భూమి) :

2023-24 సంవత్సరానికి సంబంధించి వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రైతులు ఈనెల 29వ తేదీ లోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి పవన్ కుమార్ రైతులకి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన రైతులు ఈ నెల 29 తేదీ లోపున వైయస్సార్ రైతు భరోసా కోసం తమ పరిధిలోని గల రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, 1 బి, బ్యాంక్ అకౌంట్ మరియు మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
గత సంవత్సరం లబ్ధి పొందిన రైతులకు కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారు. అదేవిధంగా అనర్హులు, మరియు మరణాల కేసుల చెల్లింపులను ఆపడానికి స్టాప్ పేమెంట్ చేసుకోవాలని ఆయన రైతులకు తెలిపారు.కావున అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Akhand Bhoomi News