యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ ని కలిసిన టిడిపి నేత సోమశేఖర్ గౌడ్
తుగ్గలి ఏప్రిల్ 26 (అఖండ భూమి) :
మంత్రాలయం నియోజకవర్గంలో జరుగుతున్న యువ గళం పాదయాత్ర లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మండల టిడిపి నాయకుడు సోమశేఖర్ గౌడ్ బుధవారం కలిశారు. మంత్రాలయం నియోజకవర్గం లో జరుగుతున్న యువ గళం పాదయాత్ర లో గుడిసె గుపరాలకు చెందిన టిడిపి మండల నాయకుడు సోమశేఖర్ గౌడ్ నారా లోకేష్ ను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తాను నారా లోకేష్ ను కలసి పలు సమస్యలను వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆయన తెలిపారు. పై చింతల కొండ, దిగువ చింతల కొండ గ్రామాల కు రోడ్లు వేయడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆసరా డబ్బులు ఇంతవరకు మహిళ ఖాతాకి జమ కాలేదని ఆయన అన్నారు. అంతేకాక రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లేక, పంట సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులపై విపరీతమైన ధరలను ప్రభుత్వం పెంచిందని ఆయన తెలిపారు. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు.