ప్రభుత్వ సహకారం రెండు పంటల కు నీళ్లు

ప్రభుత్వ సహకారం రెండు పంటల కు నీళ్లు

 

తుగ్గలి ఏప్రిల్ 26(అఖండ భూమి) :

స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కృషివల్లే నేడు తమ గ్రామాలలో రైతులు రెండు పంటలు సాగు చేసుకునేందుకు హంద్రీనీవా నీళ్లు వస్తున్నాయని తద్వారా పంటలు సాగు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని వైఎస్ఆర్సిపి నాయకులు ఓబులేసు, గంగాధర్, గోవిందరాజులు ,బద్రి, రామాంజనేయులు యాదవ్ అన్నారు. బుధవారం రాంపురం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న ,మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా కాలువ ను ఏర్పాటు చేయడం వల్ల రైతులు రెండు పంటలు సాగు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని వారు అన్నారు. ఈ సందర్భంగా గృహ సారుదులు ఇంటింటికి వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ను అతికించడం జరిగింది. దీంతో పలువురు రైతులు మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా కాలవను ఏర్పాటు చేయడం వల్ల తామంతా రెండు పంటలు పండించుకుంటూ తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయని రైతులు అన్నారు. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా మార్చి నెలాఖరు వరకు కాలువకు నీళ్లు సరఫరా చేయడం తో రెండు పంటలు పూర్తిగా పండించుకోవడం జరిగిందని రైతులు అన్నారు. దీంతో జీవితాంతం వైఎస్ఆర్ కుటుంబానికి తామంతా రుణపడి ఉంటామని రైతులు అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సహకారంతో రాంపురం గ్రామపంచాయతీలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని ప్రజలు గృహసార్థులకి తెలిపారు. వైసిపి నాయకులు గంగాధర్, గోవిందరాజులు మాట్లాడుతూ మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యే శ్రీ దేవమ్మను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు వాలంటరీలు,గృహసారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!