*బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ (ఇన్‌చార్జి) బిచ్కుంద మండలంలోని పుల్కల్ పీపీసీ (ప్రొక్యూర్మెంట్& పర్చేస్ సెంటర్) ఈ సెంటర్‌ను మంగళవారం సందర్శించి, కొనసాగుతున్న వరి సేకరణ కార్యక్రమాలను ప్రత్యక్షంగా సమీక్షించారు.
సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుల్కల్ పీపీసీ ద్వారా ఇప్పటివరకు 670 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, నిర్ణీత రైస్ మిల్లులకు తరలించడం జరిగిందనీ ఆన్నారు.
తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన వరిధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లులకు తరలించాలనీ, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే, ఆన్‌లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని, మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలని, తద్వారా రైతులకు కొనుగోలు చేసిన 48 గంటలలోపే చెల్లింపులు జరగాలనీ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యు విక్టర్, సబ్ కలెక్టర్ బాన్సువాడ కిరణ్మయి, డి సి ఎస్ ఓ, డిఆర్డిఓ , డి సి ఓ , డి ఎం సి ఎస్ , డి ఎం ఓ, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


