మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాదాభిషేకం
బెల్లంపల్లి ఆగస్టు 07(అఖండ భూమి న్యూస్):ఆగస్టు 7న నిర్వహించిన ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని,బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఎం ఆర్ పీఎస్ నాయకులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఎస్సీ వర్గీకరణ సాధనలో మందకృష్ణ మాదిగ పోరాటం చారిత్రాత్మకమని కొనియాడారు.ఆరోగ్యశ్రీతో పాటు సామాజిక న్యాయం,సమాన హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ,భవిష్యత్తులో కూడా ఎంఆర్పీఎస్ అన్ని వర్గాల ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చంద్రశేఖర్,రాజేష్ రత్న అయిలయ్య,కుమ్మరి శ్రీనివాస్, గద్దెల ధర్మేందర్,తుంగపల్లి వెంకటేష్, ఆవులూరి అరవింద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



