*ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెడ్డి సంఘాలు ఒకే వేదికపై వచ్చి రెడ్డి జాతికి జరుగుతున్న అన్యాయాన్ని విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాలపై ఈ డబ్ల్యూ ఎస్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వానికి తెలిపేందుకు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెళ్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ. అగ్రవర్ణాల్లోని పేదలకు రాజ్యాంగబద్ధంగా వారికి రావలసిన వాటాను ప్రభుత్వం వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తున్న వారు ఇచ్చినటువంటి రెడ్డి కార్పొరేషన్ ఇప్పటివరకు చట్టబద్ధంగా కార్పొరేషన్ కి రూపం లేకపోవడం కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమని నాయకులు అన్నారు.. ఈడబ్ల్యూఎస్ కమిషన్ను రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి సహాయం చేసిన దాఖలాలు లేవు. దీనివల్ల కేవలం ఎమ్మెల్యేగా ఉన్న కుటుంబాలకు మాత్రమే లాభం జరుగుతుంది తప్ప మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదని ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం కావలసింది అగ్రవర్ణాలను పేదలకి విద్య వైద్య ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలని అగ్రవర్ణాలకు రావాల్సిన నిధులను ఉద్యోగాలను వారి జనాభా ప్రకారం వారు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఒక నెల రోజుల గడువు విధించి రాని పక్షంలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ రెడ్డి ,రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి ,జిల్లా నాయకులు రాంరెడ్డి, రవీందర్ రెడ్డి ,నరేందర్ రెడ్డి మోహన్ రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…
భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…


