అక్రమ తవ్వకాలు అరికట్టకుంటే చలో అమరావతి

– అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రోద్బలంతోనే జర్నలిస్టుల స్థలాల్లో తవ్వకాలు

– తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి

– తవ్విన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి

– తవ్వకాలు వల్ల గుంతలు పడ్డ స్థలాలను చదును చేయించాలి

– ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐవీ, సుబ్బారావు, చందు జనార్ధన్

కర్నూలు టౌన్, ఏప్రిల్ 12, (ఆఖండ భూమి న్యూస్) :

జర్నలిస్టుల స్థలాల్లో తవ్వకాలు నిలిపివేయక పోతే చలో అమరావతి చేపట్టి సీఎం ఇంటి ముందే దీక్షలు చేపడతామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్ హెచ్చరించారు. బుధవారం జగన్నాథ గట్టు లోని జర్నలిస్తుల స్థలాల్లో తవ్వకాలు జరిపిన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలి ఆన్న డిమాండ్ మేరకు 2009 లో అప్పటి ప్రభుత్వం జగన్నాథ గట్టు లో 15.44 ఎకరాలను అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం రూ.65 లక్షలకు ది కర్నూల్ జర్నలిస్ట్స్ మ్యూచివల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. దీంతో సొసైటీ నిర్వహకులు ఒక్కో జర్నలిస్టులు 3.50 సెంట్ల ప్రకారం 254 మందికి కేటాయించారన్నారు. అయితే ఎర్రమటి మాఫియా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టడం దుర్మార్గమన్నారు. రూపాయి రూపాయి కూడపెట్టి డబ్బులు పోసి కొనుగోలు చేసిన స్థలాల్లో తవ్వకాలు చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. అక్రమ తవ్వకాలవల్ల సుమారు 60 ప్లాట్లు నిర్మాణానికి పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో జేసీబీ లు పెట్టి ఎడాపెడా తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ప్రోద్బలంతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ తవ్వకాల విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. నేటికీ రాత్రి వేళల్లో యదేచ్చగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నారన్నారు. కానీ అధికారులను పాలకులను కనీస చలనం కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జర్నలిస్టుల స్థలాల్లో తవ్వకాల నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో అమరావతి చేపట్టి సీఎం ఇంటి ముందే దీక్షలు చేపడతామని హెచ్చరించారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకుండా అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలు అరికట్టడంతో పాటు గుంతలు పడ్డ స్థలాలను చదును చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని, జర్నలిస్టులు ఇల్లు కట్టుకోవడానికి వీలుగా అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. లేని పక్షంలో సీఎం ఇంటి ముందు దీక్ష తప్పదని హెచ్చరించారు. స్థలాలు పరిశీలించిన వారిలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ఏచూరి, జాతీయ సమితి సభ్యులు కొండప్ప, కే నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్.వీ సుబ్బయ్య, జిల్లా గౌరవ సలహాదారులు వైవీ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈ.ఎన్. రాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుంకన్న, జిల్లా కోశాధికారి అంజి, జిల్లా సహాయ కార్యదర్శిలు శివ, వెంకటేష్ వీడియో జర్నలిస్టుల సంఘం నాయకులు ఎల్లగౌడ్ తదితరులు ఉన్నారు.
admin1

Masapogu Eswaraiah... Akhanda Bhoomi.. Telugu Daily News.. Telugu Web News.. Edtior & Publisher.. Cell : 9441626873.