కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామం లో పిడుగు పడి గంపా సత్యవతి (26) అనే వివాహిత మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ఆమె మరణ వార్తను విన్న గ్రామస్తులు బందువులు కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో మునిగిపోయారు మాల మహానాడు జిల్లా కో ఆర్డినేటర్ చిట్టుమూరి గోవింద్ మాట్లాడుతూ పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించు కోవడం కోసం పొలాల్లోకి కూలి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా భర్త పిల్లలు పడే కన్నీటి రోధన ను చూసి తీవ్ర దిబ్భ్రాంతికి లోనయ్యానని ఆయన అన్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు వాహన సహాయం అందక మృతురాలి బందువులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన అన్నారు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ప్రభుత్వం కుటుంబానికి నష్టపరిహారం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


