ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!
ఊరువాడ ఒక్కచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ స్వాగతం పలకగా…మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! మహిళలు తమ కష్ట సుఖాలను పాటల ద్వారా చెప్పుతూ స్వాగతం పలకగా…మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!మాయమ్మ నువ్వమ్మ మమ్మేలు మాయమ్మఅంటూ వేడుకొనగా…మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు గాజుల సవ్వడితో స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..! తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన మన ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఎంగిలి పులా బతుకమ్మ శుభాకాంక్షలు. శ్రీమతి మంజుల పత్తిపాటి కవయిత్రి చరవాణి 9347042218