అంగన్వాడి కేంద్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

 

 

ఎన్ టి పి సి (డి టైప్ )అంగన్వాడి కేంద్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

జ్యోతినగర్ (ఎన్ టి పి సి) అక్టోబర్ 12 : ఐసీడీఎస్ ప్రాజెక్టు రామగుండం అర్బన్ అధికారుల సూచన మేరకు గురువారం నాడు ఎన్ టి పి సి, జ్యోతి నగర్, పి టి ఎస్ లోని డి టైప్ క్వార్టర్స్ అంగన్వాడి కేంద్రంలో ముందస్తు బతుకమ్మ (ఎంగిలి పూల) సంబరాలు జరిగాయి. ఇందులో భాగంగా అంగన్వాడి టీచర్ కె సుజాత ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలు ఎంతో సంబరంగా తీరొక్క పూలతో అలంకరించి పేర్చిన బతుకమ్మలతో సంప్రదాయ బద్ధమైన పాటలతో ఆడి పాడి పరవశించారు. తెలంగాణ మహిళా మూర్తులకి ఎంతో ప్రత్యేకమైన ఈ పండుగని పాఠశాలలకు సెలవుల కారణంగా నేడు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డి టైప్ క్వాటర్ అంగన్వాడి టీచర్ కె సుజాత, ఆయ పుష్ప విద్యార్థినిలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!