సూర్యాపేట జిల్లా ఎస్పి గా బీ కే రాహుల్ హెగ్డే

 

 

సూర్యాపేట జిల్లా ఎస్పి గా బీ కే రాహుల్ హెగ్డే

సూర్యాపేట, అక్టోబర్ 13, (అఖండ భూమి) జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) గా బీ కే రాహుల్ హెగ్డే నియమింపబడ్డారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన బదిలీలలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా సూర్యాపేట ఎస్పీగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ బదిలీ కావడంతో శుక్రవారం వరకు అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా రాహుల్ హెగ్డేను సూర్యాపేట ఎస్పీగా బదిలీ చేశారు. 2014 ఐపీఎస్ బ్యాచ్ చెందిన రాహుల్ కర్ణాటక కు చెందిన వారు. ఆర్ వి కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన ప్రతిభావంతుడుగా రాహుల్ హెగ్డే ను చెపుతుంటారు మొదటగా 2015 లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2018 లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాదులో ట్రాఫిక్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ గా ఫిబ్రవరి 2023 నుంచి పనిచేస్తున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!