లయోలా హైస్కూల్లో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 20 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లయోలా హై స్కూల్లో బతుకమ్మ పండుగ ఉత్సవాలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఏట నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలలో భాగంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలు డిజె సౌండ్ ఆటపాటల
తో అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ ఉత్సవాలలో విద్యార్థులకు సెలవు దినాలు ప్రకటించడంతో పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఆకర్షణీయమైన వస్తాలు ధరించి భక్తిశ్రద్ధలతో తీరొక్క రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ, పాటలతో నాట్య నృత్యంలో అందర్నీ ఆకట్టుకున్నారు. మొత్తానికి లయోలా పాఠశాల విద్యార్థినిలు చదువులోనే కాకుండా బతుకమ్మ ఆటపాటలతో మొత్తానికి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో లయోలా స్కూల్ కరస్పాండెంట్ పహిముద్దీన్, ప్రిన్సిపాల్ చారి,, ఉపాధ్యాయ బృందం, లయోలా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.