ప్రపంచ మనుగడ జనాభా పైనే ఆధారపడి ఉంటుంది.
అబ్రబోయిన శ్రీనివాస్ ఎం ఎస్ డబ్ల్యూ. (సీనియర్ జర్నలిస్ట్)..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 21 ( అఖండ భూమి న్యూస్) ప్రపంచ జనాభా మెరుగైన జనాభా దేశాభివృద్ధిలో కీలకం ప్రపంచ జనాభా , దీనిముఖ్య ఉద్దేశ్యం పెరుగుతున్న జనాభా వల్ల కలుగు లాభాలు ,అనార్ధాలను ఉపేక్షించాల, నియంత్రించేలా అనే ఆలోచనలో పడ్డాయి. 1989 నుంచి ఐక్య రాజ్యసమితి జనాభా నిధి నిర్వహిస్తుంది. అధిక జనాభా వనరులపై ప్రభావం చూపుతుంది. కుటుంబ నియంత్రణపై దృష్టి సారించడం, దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యువత కావాలని కోరుకుంటున్నాయి. ప్రజల్లో చైతన్యం కల్పించడం ఇక్కడ భారత్ లాంటి దేశాల్లో కొన్ని మతస్తులు జనాభా నియంత్రణను వ్యతిరేకిస్తున్నారు. కొన్ని మతాల వారు మన జనాభా పెరుగాక పోతే అస్తిత్వం ప్రమాదంలో పడవచ్చు సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధిక జనాభా వల్ల వనరులు, ప్రకృతి సంపద అధికంగా వినియోగం అయ్యి కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వాలు సంస్థలు విధానాలు, గణాంకాలు మొదలు అగునవి జనాభా ప్రాతిపదికన నిర్వహిస్తాయి. ప్రపంచ జనాభా దినోత్సవం ద్వారా మానవ అభివృద్ధి వనరుల వినియోగం,సమాజం లో సమతుల్యత వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఒక బాధ్యతా యుతమైన సమాజం కోసం మనమందరం సహాకరించాలి. 1987 లో ప్రపంచ జనాభా 5 బిలియన్ల జనాభా దాటినా సందర్బంగా 5బిలియన్ డే జరపడం జరిగింది. నేడు 2022 నవంబర్ వరకు 800 కోట్లకు చేరింది.ప్రస్తుతం 820 కోట్లు 2030 నాటికి 900 కోట్ల కుచేరేఅవకాశంఉంది.భారతదేశం జనాభా 146 కోట్లు జనవరి1,2025 చేరింది, తెలంగాణ జనాభా 3కోట్ల 85 లక్షలు మన భవిష్యత్తు సమర్ధవంతమైన జనాభా నియంత్రణ సమగ్ర అభివృద్ధి కి మార్గంగా ఉంటుంది. ప్రపంచ దేశాలలో భారత్, చైనా దేశాలలో అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే యువత అత్యధికంగా భారత్ లోనే ఉన్నారు. ప్రపంచ దేశాలు భారత్ యువత సహకారం పై కన్నేసింది. అత్యధిక జనాభాతో పాటు అత్యధికంగా ఉన్న యువత ఇండియాలోనే ఉండడం అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు బాటలు వేస్తుంది. ప్రపంచంలో భారతదేశం నుండి వలసవాదులు లేని దేశాలు లేవు అని చెప్పుకోవచ్చు. అత్యధిక జనాభా కలిగిన భారత్ నుండి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ జిడిపి పెరుగుదలకు భారతీయులు ఉపయోగపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరగడం మంచిదా? తగ్గించడం మంచిదా? దానిపై భారత ప్రభుత్వం ఎటు తేల్చుకోలేక పోతుంది. రాబోయే ప్రపంచ తరాలకు భారతీయులు సేవలు అత్యవసరం కావచ్చు అని మేధావులు, నీపునులు అంటున్నారు.