పెద్దల అమావాస్య రోజు ఏమి చెయ్యాలి..?

పెద్దల అమావాస్య రోజు ఏమి చెయ్యాలి..?

 

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; సెప్టెంబర్ 21,(అఖండ భూమి న్యూస్) మహలయా అమావాస్య రోజునమీకుటుంబసభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది. మీ గోత్రం ఉదాహ రణకు శ్రీవత్సస మీ పేరు శేషారావు చెప్పుకొని,నా జన్మకు మూల కారణమైన నా తల్లి -దండ్రులకు నా యొక్క అనంత కోటి నమస్కారములు. అలాగే నా తల్లి ,దండ్రులకు మూలమైన తాతలకు, ముత్తాతలకు అనంతకోటి ప్రణామములు. సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరం పరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంత కోటినమస్కారములు. ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి, నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను. ఈ వంశం లో జన్మించినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను.

మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోకహిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి అని కోరుకుంటారు.

ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు

ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి అని వేడుకుంటారు.

నాలోనూ, నా కుటుంబ సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుః, ఆరోగ్య, ఐశ్వర్య ముల నొసగి, ధర్మార్ద, కామ, మోక్ష ముల నొసగి, అహం పదార్ద రహిత స్థితి కలిగేటట్లుగా దీవించి

నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతారు.

అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్ట దిక్పాలకులు,

నవ గ్రహాలు, సమస్త సద్గురువులు , సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా ..

ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరిస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!