శౌర్య జాగరణ యాత్ర

 

 

శౌర్య జాగరణ యాత్ర

సూర్యాపేట, అక్టోబర్ 13, (అఖండ భూమి) సూర్యాపేటలో యువతను చైతన్యం నింపడం కోసం విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర గుడి వద్ద గోరక్ష క్షేత్ర ప్రముఖు తుమురుగోటి యాదగిరి రావు కాషాయ జండా ఊపి యాత్రను ప్రారంభించాడు అనంతరం గుంటి నగేష్ శంఖారాం పూరించి కోలాట భజన బృందాలతో ముందుకు సాగారు ఈ యాత్ర వెంకటేశ్వర గుడి నుండి శంకర్ విలాస్ వాణిజ్య భవన్ టి ఎస్ ఆర్ సెంటర్ పూల సెంటర్ మీదుగా కోర్టు చౌరస్తా నుండి పబ్లిక్ క్లబ్ వరకు చేరుకొని అక్కడ ముగింపు సమావేశం జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన యాదగిరి రావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ బంధువులను యువకులను చైతన్యపరిచేందుకు హిందూ ధర్మ రక్షణకై ప్రచారానికి దేశవ్యాప్తంగా ఈ యొక్క శౌర్య జాగరణ యాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువుగా అవతరించాలని రామరాజ్యం రావాలని ప్రజలందరూ సంకల్పం తీసుకొని ముందుకు నడవాలని ఈ దేశ రక్షణకై యువతీ యువకులు మేధావులు దేశభక్తులు జాతీయ భావం కలిగిన వారందరూ కూడా పాటుపడాలని కోరారు సూర్యాపేటలో శౌర్య జాగరణ యాత్ర బలప పరాక్రమం కలిగిన హనుమాన్ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది 2024 జనవరి మూడో వారంలో జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహక కార్యక్రమంగా మరియు విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు చేరువవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ నిర్వహణలో శౌర్య జాగరణ యాత్రలు జరుగుతున్నాయని తెలియజేశారు. అందులో భాగంగా సూర్యాపేటలో నిర్వహించడం జరిగిందని ఈ దేశం ప్రజలు రామరాజ్యం కావాలని కోరుకుంటున్నారని నేటి యువత రాముని ఆదర్శం తీసుకుని ఈ దేశ సమైక్యత కోసం దేశ భద్రత కోసం అన్నగారిన వర్గాల అభినతికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగవల్లి బ్రహ్మయ్య ఎక్స్ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు వి.ఐ.పి పట్టణ ప్ర కార్యదర్శి మహేశ్వరo రవిచంద్ర, పర్వతం శ్రీధర్ కుమార్, పసునూరి దినేష్, చింతా వెంకన్న , బైరు విజయ్, కృష్ణ, తండు దేవిక ,చలమల నరసింహ, సలిగంటి వీరేందర్, నాగవెల్లి ప్రభాకర్, తణుకునూరు సంతోష్, తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!