పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి పరామర్శ

 

 

 

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి పరామర్శ

సూర్యాపేట, అక్టోబర్ 13,(అఖండ భూమి) భాజపా నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి తో పాటు కుటుంబ సభ్యులను సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య స్వర్గస్తురాలయింది. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న రజనీకుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!