ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…

ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; సెప్టెంబర్ 22 (అఖండ భూమి న్యూస్)

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో సోమవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ముత్యాల పోచమ్మ ఆలయంలో చైతన్య యూత్ హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంతో నింపాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చరు, ఉదయం వేకువజామునే భక్తులు ఆలయానికి చేరుకుని భవాని దీక్షను స్వీకరించారు. అనంతరం పండితులు వేద మంత్రాల మధ్య అమ్మవారి ప్రతిష్ఠాపన చేశారు. అభిషేకాలు, అలంకరణలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం భక్తుల మధ్య ఉత్సాహాన్ని నింపి, ఆలయ ప్రాంగణాన్ని శక్తి స్వరూపంగా మార్చింది. శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది పదకొండు రోజుల పాటు కొనసాగనున్నాయని, ప్రతి రోజు అమ్మవారు విభిన్న అవతారాల్లో దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు. చైతన్య యూత్ , హిందూ యువసేన సభ్యులు ఈ ఉత్సవాలను సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, హిందూ సంస్కృతిని పరిరక్షించడం మరియు యువతను ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరేపించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని భక్తులు ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి, అమ్మవారి ఆశీస్సులు పొందారు, కార్యక్రమంలో సభ్యులు ప్యాలాల రాములు, సంగమేశ్వర్ , పప్పు వెంకట్, రమేష్, ప్రభాకర్, శివప్రసాద్, విద్యాసాగర్, నవీన్, , అర్జున్ గౌడ్, సాయి, భాను, అర్జున్, ఫణి, కిరణ్, రాహుల్, సూర్య, కపిల్, తరుణ్, సాయిరాజ్, భాస్కర్, మధు, చందు, సంజయ్, ఈశ్వర్, వినీత్, నాగబాబు, సన్నీ, నిహళ్, మాత స్వాములు తదితరులు పాల్గొని, ఉత్సవాలను విజయవంతం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!