టి ఎస్ పి ఎస్ సి ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా సభ్యులను తొలగించాలని డిమాండ్ చేస్తూ
అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అక్టోబర్ 14న జరిగే రాస్తారోకోను
జయప్రదం చేయండి.
సూర్యాపేట అక్టోబర్ అక్టోబర్ 13 (అఖండ భూమి) టి ఎస్ పి ఎస్ సి ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా సభ్యులను తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 14న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ దగ్గర సూర్యాపేట- విజయవాడ జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహిస్తున్నామని విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, అఖిలపక్ష పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాస్తారోకోను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, సిపిఐ నాయకులు ప్రభాకర్, ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు కరీం, ప్రజా పంద జిల్లా
నాయకులు రామోజీ అన్నారు. శుక్రవారం మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టి ఎస్ పి ఎస్ నిర్వహించిన పరీక్షా ఫలితాల లీకేజ్, అమ్మకం వ్యవహారాలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్ పి ఎస్ సి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. 16 పరీక్ష పత్రాలు లీక్ కావడమే కాకుండా వాటిని అమ్ముకున్నారని ఆరోపించారు. కమీషన్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలని, కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరారు. డీఎస్సీ పోస్టుల సంఖ్యను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 కు పెంచాలని బ్యాక్ లాక్ పోస్టులు కాకుండా అదనంగా డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుకు కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎం ), తెలంగాణ జన సమితి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ ప్రజా ప్రజాపంద, బీఎస్పీ, ఇతర వామపక్షాలను కలుపుకొని అక్టోబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉదయం 10:30 నుండి 12: 30 వరకు రాస్తారోకో చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకున్నాయని అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ దగ్గర ఉదయం 10 గంటలకు రాస్తారోకో ప్రారంభం అవుతుందన్నారు. ఈ రాస్తారోకోలో నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలు, అఖిలపక్షపార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…