రంపచోడవరం బహిరంగ సభను కార్మికులు విజయవంతం చేయాలి

 

 

రంపచోడవరం బహిరంగ సభను కార్మికులు విజయవంతం చేయాలి

రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 11 అల్లూరు జిల్లా

రంపచోడవరం లో జరుగు బహిరంగ సభను విజయవంతం చేయండి.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి వెంకట్. సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల రంగాల కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని రంపచోడవరం సిఐటియు జిల్లాకార్యదర్శి పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు, రాజవొమ్మంగిలో మంగళవారం తాపీ మేస్త్రీల సమావేశ మందిరంలో సిఐటియు మండల విస్తృతస్థాయి సమావేశం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు అధ్యక్షతన జరిగింది,ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకట్ మాట్లాడుతూ,రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందన్నారు, కార్మికుల హక్కులు చట్టాలు అమలు కోసం సమస్యల పరిష్కారం కోసం,ఉద్యోగ భద్రత, పనికి తగిన వేతనం తదితర డిమాండ్ల పరిష్కారానికై శాంతియుత ధర్నాలు,ఆందోళనలు చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం నియంతృత్వం పెరిగిపోయిందని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీల అమలు చేయకపోగా వాటిని అమలు చేయాలని ప్రశ్నిస్తున్న కార్మికులపై, కార్మిక సంఘాల నేతలపై అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలు,అక్రమ కేసులు వంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గం అన్నారు,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు, ప్రభుత్వాలు బడా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ వారికి కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తున్నారని సామాన్య మధ్యతరగతి ప్రజల, కార్మికుల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు, అంగన్వాడి ఆశ మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న కార్మికులపై మహిళలని చూడకుండా ప్రభుత్వం పోలీసులు లాఠీచార్జి బలవంతపు అరెస్టులు వంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు, ప్రభుత్వం కార్మికుల పట్ల అనిచివేత ధోరణితో ఉందన్నారు, భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు, వాళ్లకి రావాల్సిన రాయితీలు,సంక్షేమ పథకాలు,క్లయిమ్ లు నేటికీ రాని పరిస్థితి నెలకొందన్నారు,కార్మికుల దెబ్బకు రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమన్నారు,కార్మికుల సమస్యల పరిష్కారం కోసం,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీం వర్కర్లు,ఉద్యోగ భద్రత,కనీస వేతనాలు అమలు,భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 15న రంపచోడవరం లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ అచ్చారావు,పి కిరణ్, సిహెచ్ రాంబాబు,కె వెంకటలక్ష్మి,లక్ష్మీశ్రీ, చంటమ్మ,సత్యవతి,చిన్ని కుమారి,వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!