అటవీశాఖ అధికారుల కు డబ్బులు ఇచ్చినామన్న మాట ఆవాస్తవం శ్రీశైలం నవంబర్ 28 (అఖండ భూమి) : మహా పుణ్యక్షేత్రం కు చేరువలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద అడవి పండ్లు, సోడాలు అమ్ముకుంటు జీవనం సాగిస్తున్న మాకు అటవీశాఖ అధికారుల కు డబ్బులు ఇచ్చినా మన్న మాట అవస్తవమని సుండి పెంట వాస్తవ్యులు ఎలకపాటి జ్యోతి, కుమారీ అను మహిళలు తెలిపారు. సహాయం చేయాలని అటవీశాఖ అధికారులను మేము వేడుకుంటే మాకు బ్రతుకుతెరువుకు అవకాశం కల్పించారని చెప్పారు. అటవీ శాఖ అధికారులకు మేము డబ్బులు ఇచ్చినామని అవాస్తవంగా ప్రచారం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు మేము ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలియజేస్తున్నామన్నారు. ఆలయం వద్ద అటవీ పండ్లు అమ్ముకుంటే కుటుంబం జరిగే పరిస్థితిలో ఉన్న మేము అధికారులకు లంచాలు ఇచ్చినామని ప్రచారం చేయడం సరికాదని తెలిపారు. ఆలయం వద్ద అటవీ పండ్ల అమ్ముకునే మమల్ని అటవీశాఖ అధికారులు ఇక్కడ ఉండవద్దని తెలపడంతో మా యొక్క పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. మా యొక్క పేద కుటుంబాల పై అటవీశాఖ అధికారులు దయచేసి మాకు సాక్షి గణపతి ఆలయం వద్ద మరల అమ్ముకు నేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు.