లోకుల గాంధీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కు మండల టాపర్స్ దరఖాస్తు చేసుకోండి
ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లోకుల రమేష్. మురళీకృష్ణ
కొయ్యూరు అఖండ భూమి
మే 6 అల్లూరి జిల్లా
10వ తరగతి పరీక్షల్లో అరకు పాడేరు నియోజకవర్గాల్లో ఉన్న 11 మండలాల విద్యార్థుల్లో మండల లో అధిక మార్కులు వచ్చిన విద్యార్థులు లోకుల గాంధీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లోకుల రమేష్ మఠం మురళి కృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ మటం మురళీకృష్ణ మాట్లాడుతూ ముందుగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు మానసికంగా ధైర్యంగా ఉండి చదవాలని ఆయన సూచించారు అలాగే ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 949190 7677, 810 64 50108 నెంబర్లను పూర్తి వివరాలు కొరకు సంప్రదించాలని వారు కోరారుఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు లోకుల కిరణ్ మాస్టర్ సభ్యులు అచ్యుతవాణి పాల్గొన్నారు